![]() |
File Photo : Bhagwant Mann(Left), Arvind Kejriwal(Right) |
పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌తో కలిసి విలేకరుల సమావేశంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణిస్తున్న నేపథ్యంలో వాయుకాలుష్యం ఢిల్లీకే కాకుండా ఉత్తర భారతదేశానికే సవాలుగా మారుతుందన్నారు.
బీజేపీని ఉద్దేశిస్తూ, ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడానికి ఇది సరైన సమయం కాదని కేజ్రీవాల్ వాఖ్యానించారు.
వాయు కాలుష్య సమస్యకు ఢిల్లీ ప్రభుత్వం లేదా పంజాబ్ ప్రభుత్వం మాత్రమే బాధ్యులు కాదన్నారు.
నిర్దిష్ట చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని అరవింద్ కేజ్రీవాల్ కోరారు.
వాయు కాలుష్యం కారణంగా ఢిల్లీలోని అన్ని ప్రాథమిక పాఠశాలలను రేపటి నుంచి మూసివేస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని పంజాబ్ దేశ రాజధానిలో కాలుష్యానికి దోహదం చేస్తుందని అరవింద్ కేజ్రీవాల్ అంగీకరించాడు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి