టికెట్ నిరాకరించడంతో విద్యుత్ టవర్ పైకెక్కిన AAP నాయకుడు

    

Delhi AAP Councillor Haseeb ul Hasan Delhi Municipal Corporation  Tower suicide Ticket Politics Meter

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మాజీ కౌన్సిలర్ హసీబ్ ఉల్ హసన్, శాస్త్రి పార్క్‌లోని విద్యుత్ ట్రాన్స్‌మిషన్ టవర్ పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. త్వరలో జరగనున్న ఢిల్లీ మునిసిపల్ బాడీ ఎన్నికలలో తనకు టికెట్ నిరాకరించారని, అందుకే ఆత్మహత్య చేసుకోవడానికి సిద్దమయ్యాను అన్నాడు. 

ఆమ్ ఆద్మీ పార్టీ టిక్కెట్టును దీపు చౌదరికి 3 కోట్ల రూపాయలకు అమ్మేసిందని, అంత మొత్తం చెల్లించే స్థోమత నాకు లేకపోవడంతో టికెట్ నిరాకరించారని అన్నారు హసీబ్ ఉల్ హసన్. 

"నాకు ఏదైనా జరిగి నేను చనిపోతే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన దుర్గేష్ పాఠక్, అతిషి బాధ్యత వహించాలి. నా బ్యాంకు పాస్‌బుక్‌తో సహా నా ఒరిజినల్ డాక్యుమెంట్‌లు వారి వద్ద ఉన్నాయి. రేపు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కానీ వారు నా పత్రాలను నాకు ఇవ్వడం లేదు” అని హసన్ అన్నారు.

కొద్దిసేపటి తర్వాత టవర్ పై నుండి కిందికి దిగిన హాసన్, మీడియా ఒత్తిడి వల్లే ఆప్ నేతలు తన పత్రాలను తిరిగి ఇచ్చారు అన్నాడు.  “మీడియా రాకపోతే దుర్గేష్ పాఠక్, అతిషి, సంజయ్ సింగ్ నా పేపర్లు తిరిగి ఇచ్చేవారు కాదు. నేను రేపు నామినేషన్ దాఖలు చేస్తాను' అని హసన్ తెలిపారు.


0/Post a Comment/Comments