బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే జుల్ఫికర్ అహ్మద్ భుట్టో పై ఐటీ దాడులు చేసింది. నివేదికల ప్రకారం, భారతదేశంలోని 5 రాష్ట్రాల్లో భుట్టోకు సంబంధించిన 35 ప్రదేశాలపై ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. 88 గంటల పాటు కొనసాగిన ఈ దాడుల్లో దాదాపు 200 మంది ఐటీ అధికారులు, 250 మంది పారామిలటరీ సిబ్బంది, ఇతర భద్రతా సిబ్బంది పాల్గొన్నారు.
ఢిల్లీ, ముంబై, రాయ్‌పూర్, ఉన్నావ్, కాన్పూర్, ఘజియాబాద్, మీరట్, చండీగఢ్‌తో సహా 12 నగరాల్లో (HMA Group)హెచ్‌ఎంఏ గ్రూప్‌కు సంబంధించిన ప్రాంతాల్లో ఐటీ శాఖ దాడులు నిర్వహించింది.
ఐటీ దాడులు చేసిన ప్రదేశాల నుండి 100 కోట్లు రికవరీ చేయడం జరిగింది.
జుల్ఫికర్ అహ్మద్ భుట్టో మాంసం ఎగుమతిదారుడు, HMA గ్రూప్ అనే సంస్థకు యజమాని. భుట్టో 2007లో బీఎస్పీ(BSP) టికెట్‌పై ఆగ్రా కంటోన్మెంట్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
మాంసం ఎగుమతి చేయడంలో హెచ్‌ఎంఏ గ్రూప్(HMA Group) దేశంలోనే మూడో స్థానంలో ఉందని ఒక సీనియర్ అధికారి ప్రకటనలో తెలిపారు. దాదాపు రూ.2,000 కోట్ల టర్నోవర్‌ను కలిగి ఉన్న ఈ కంపెనీ 40 దేశాలకు మాంసాన్ని ఎగుమతి చేస్తోంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి