జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం సాయంత్రం విశాఖపట్నంలోని INS చోళ గెస్ట్ హౌస్ లో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
షెడ్యూల్ ప్రకారం 10 నిమిషాల పాటు జరగాల్సిన ఈ సమావేశం దాదాపు 35 నిమిషాల పాటు సాగింది.
సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్ విలేకరులతో మాట్లాడుతూ.. “విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోదీ గారి రెండు రోజుల పర్యటనకు సంబంధించి, నాకు రెండు రోజుల క్రితం PMO నుండి ఫోన్ వచ్చింది. 2014లో బీజేపీ అధికారంలోకి రాకముందు ఆయన్ను కలిశాను. ఎనిమిదేళ్ల తర్వాత ఈ రోజు ఆయనను కలవడం జరిగింది. రాష్ట్ర పరిస్థితుల గురించి ప్రధాని మోదీ నన్ను అడిగి తెలుసుకున్నారు, నాకు తెలిసిన వాటిని వారికీ స్పష్టంగా వివరించాను. తమ భేటీతో ఆంధ్ర రాష్ట్రానికి మంచి భవిష్యత్తు వస్తుందన్న నమ్మకం నాకు ఉంది’’ అని అన్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి