చీకట్లు కమ్ముకున్న తెలంగాణలో కమలం వికసిస్తుంది : ప్రధాని మోదీ

 

Narendra Modi Telangana Tour BJP TRS KCE Politics Meter

ప్రధాని మోదీ ఈ రోజు రామగుండంలో పర్యటించనున్నా సంగతి తెలిసిందే.  కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు మోదీ.  

విశాఖపట్నం పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ ఈరోజు మధ్యాహ్నం తెలంగాణ చేరుకున్నారు.

బేగంపేట విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభలో ప్రసంగిస్తూ..  "తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేయట్లేదు. ఇక్కడ అధికారంలో ఉన్న వారి వైఖరి వల్ల తెలంగాణ అభివృద్ధి చెందడం లేదు. చీకట్లు కమ్ముకున్న తెలంగాణలో కమలం తప్పక వికసిస్తుంది. తెలంగాణలో కొనసాగుతున్న అవినీతి, అక్రమాలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. పేదలను దోచుకునేవాళ్లను వదిలిపెట్టమని స్పష్టం చేస్తున్నాను " అని అన్నారు. 

మునుగోడు ఉపఎన్నికపై ప్రధాని మోదీ మాట్లాడుతూ.. "మునుగోడు ప్రజలు బిజెపిపై గొప్ప ఆదరణ చూపెట్టారు. బీజేపీని ఎదురుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం మొత్తం ఒక్క మునుగోడు నియోజకవర్గంలోనే మకాం వేసింది. దీనిబట్టి బిజెపి కార్యకర్తల కృషి, అంకితభావం అర్థమవుతోంది. తెలంగాణలో చీకట్లు తొలగిపోవడం ఎంతో దూరం లేదు. 1984లో లోక్ సభ ఎన్నికల్లో బిజెపి రెండు సీట్లు మాత్రమే గెలిచింది. అందులో ఒకటి తెలంగాణ నుంచే. ఇప్పుడు లోక్ సభలో బిజెపికి 300 మందికి పైగా సభ్యులున్నారు. తెలంగాణలో బిజెపి అతిపెద్ద పార్టీగా మారే రోజు ఎంతో దూరం లేదు" అని అన్నారు.. 

0/Post a Comment/Comments