మోర్బీ దుర్ఘటనలో 135 మంది మృతి - బాధితులను పరామర్శించనున్న ప్రధాని

 

Morbi Bridge Collapse narendra modi













గుజరాత్‌లోని మోర్బీలో మచ్చు నదిపై దాదాపు 100 ఏళ్ల నాటి వేలాడే వంతెన ఆదివారం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 135 మంది మరణించారు.. 

ప్రధాని మోదీ మోర్బిలో పరిస్థితిని సమీక్షించడానికి ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. 

మోర్బీ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి బుధవారం గుజరాత్ రాష్ట్రవ్యాప్తంగా సంతాపం పాటించనున్నారు. 

మోర్బిలో జరుగుతున్న రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్ల గురించి ప్రధాని సమీక్షిస్తున్నారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహాయం అందేలా చూడాలని అధికారులకు ఆదేశించారు ప్రధాని.. 

కేబుల్ బ్రిడ్జి కూలిన ప్రదేశాన్ని సందర్శించి, బాధితులను పరామర్శించనున్నరు మోదీ.

0/Post a Comment/Comments