మంగళగిరి : ఇప్పటం గ్రామంలో ఉద్రిక్తతల మధ్య బాధితులను పరామర్శించిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan visit Ippatam village politics meter

మంగళగిరి నియోజకవర్గం, ఇప్పటం గ్రామంలో ఉద్రిక్తత కొనసాగుతోంది... రోడ్డు విస్తరణ పేరుతో అధికారులు ఇళ్లు కూల్చివేస్తున్న విషయం తెలుసుకున్న జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామానికి బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు.. 

దాంతో జనసేన పార్టీ  ఆఫీసు నుండి నడుచుకుంటూ ఇప్పటం గ్రామం బయలుదేరారు పవన్.. 


పవన్ కళ్యాణ్ మీడియా తో మాట్లాడుతూ "రోడ్డు వెడల్పు అంటూ మహాత్మా గాంధీ, అబ్దుల్ కలాం, నెహ్రూ గారి విగ్రహాలు, ఆఖరికి శివుడికి కాపలాగా ఉండే నంది విగ్రహాన్ని కూడా కూల్చేశారు, ఒక్క వైఎస్సార్ విగ్రహాన్ని కూల్చకుండా వదిలేశారు ఎందుకు? మొన్న చెప్పు చూపిస్తే ప్రజాస్వామ్యమా అని అన్నారు, మరి అన్యాయంగా ప్రజల ఇల్లు కూల్చడం ప్రజాస్వామ్యమా ?" అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు.. 

వైసీపీ అరాచకాలు ఇలాగే సాగితే, ఇడుపులపాయలో మీ ఇళ్ళు మీద నుండి హైవే వేస్తామని  ఘాటు వాక్యాలు చేశారు పవన్.. 

ఈ కూల్చివేతకు సజ్జల రామకృష్ణా రెడ్డి భాధ్యత తీసుకోవాలన్నారు.. 

ఇప్పటం గ్రామంలో కూల్చివేసిన ప్రతి ఇంటిని పరిశీలించిన పవన్, బాధిత గ్రామస్తులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు..  


MORE PICS :

Pawan Kalyan visit Ippatam village politics meter
Pawan Kalyan visit Ippatam village politics meter
Pawan Kalyan visit Ippatam village politics meter





 

0/Post a Comment/Comments