ఒక్క అవకాశం ఇవ్వండి.. అవినీతి రహిత పాలన ఎలా ఉంటుందో చూపిస్తా : పవన్

Pawan Kalyan Janasena Vizianagaram Politics Meter

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం విజయనగరం జిల్లా గుంకలాంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన "జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు" కార్యక్రమంలో పాల్గొన్నారు.

గుంకలాం జగనన్న కాలనీలో ఇళ్ళ నిర్మాణాలను, లే-అవుట్ ను పరిశీలించారు పవన్.  

దారిపొడుగునా ప్రజల సమస్యలు తెలుసుకున్న జనసేన అధినేత ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానని భరోసానిచ్చారు. 

పవన్ కళ్యాణ్ ప్రజలును ఉద్దేశించి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి. నా కోసం అడగట్ల, మీ భవిష్యత్తు కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం అడుగుతున్న.. అవినీతి రహిత పాలన ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను అని అన్నారు.

0/Post a Comment/Comments