మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ (TDP) సీనియర్ నాయకుడు సీహెచ్ అయ్యన్న పాత్రుడు, ఆయన కుమారుడు సీహెచ్ రాజేష్‌లను ఈ రోజు తెల్లవారుజామున అనకాపల్లి జిల్లా, నర్సీపట్నంలోని ఆయన ఇంటి వద్ద CID అధికారులు అరెస్టు చేశారు.
సిఐడితో సహా దాదాపు 200 మంది పోలీసులు వైర్ కట్టర్లతో అయ్యన్న పాత్రుడు ఇంటికి తెల్లవారుజామున చేరుకొని బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించారని, గేటు వద్ద అరెస్ట్ నోటీసు అతికించారని అయ్యన్న పాత్రుడు కుటుంబ సభ్యులు తెలిపారు..
భూమిని ఆక్రమించారని, ఫోర్జరీ చేశారని ఆరోపిస్తూ తెల్లవారుజామున 4 గంటలకు సీనియర్ నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు..
ఈ అరెస్టుపై టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు తో సహా ఇతర పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి