నువ్వానేనా అన్నట్టు సాగిన మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పైచేయి సాధించింది..
ప్రభాకర్ రెడ్డి తన ప్రత్యర్థి అయిన రాజగోపాల్ రెడ్డి పై 10,309 ఓట్లతో గెలిచారు..
కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కోల్పోయింది..
టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 97,006 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి 86,697 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి 23,906 పడ్డాయి..
ఆగష్టు 8న మునుగోడు అభివృద్ధికి అధికార పార్టీ సహకరించట్లేదంటూ రాజీనామా చేసారు రాజగోపాల్ రెడ్డి.
దుబ్బాక, హుజురాబాద్ ఉపఎన్నికల్లో బీజేపీ చేతుల్లో టీఆర్ఎస్ ఓడిపోవడంతో మునుగోడు ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్..
20 రోజులకుపైగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ ,ఎంపీ లు మునుగోడు నియోజకవర్గంలో చురుగ్గా ప్రచారం చేసారు.. సీఎం కేసీఆర్ కూడా బారి బహిరంగ సభా నిర్వహించారు..
మునుగోడులో టీఆర్‌ఎస్ గెలవడంతో తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు పార్టీ కార్యకర్తలు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి