గ్రామాలు అభివృద్ధి చెందాలని గాంధీ ఆకాంక్షించారు - గాంధీగ్రామ్ కాన్వొకేషన్‌లో ప్రధాని మోదీ

Narendra Modi Tamil Nadu Gandhigram Rural Institute Politics meter

దక్షిణ భారత పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం తమిళనాడు చేరుకున్నారు. దిండిగల్‌లో ప్రధానికి తమిళనాడు గవర్నర్ తిరు ఆర్‌ఎన్ రవి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఇతర ప్రముఖులు స్వాగతం పలికారు.

తమిళనాడులోని గాంధీగ్రామ్ రూరల్ ఇన్‌స్టిట్యూట్ 36వ కాన్వకేషన్‌లో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ "గాంధీగ్రామ్‌ను మహాత్మా గాంధీ స్వయంగా ప్రారంభించారు. గ్రామాభివృద్ధికి సంబంధించిన ఆయన ఆలోచనల స్ఫూర్తిని ఇక్కడ చూడవచ్చు. భారతదేశ భవిష్యత్తు 'Can do'(చేయగలము) తరం యువత చేతుల్లో ఉంది" అని అన్నారు. 

గాంధీగ్రామ్ బాపుతో దగ్గరి అనుబంధం ఉన్న ప్రదేశం. ఆయన హృదయానికి దగ్గరగా ఉన్న ఆలోచనలకు అనుగుణంగా పనిచేయడమే ఆయనకు అర్పించే ఉత్తమ నివాళి. అలాంటి ఆలోచనలలో ఒకటి ఖాదీ. ఖాదీ చాలా కాలంగా నిర్లక్ష్యం చేయబడింది. కానీ 'ఖాదీ ఫర్ నేషన్, ఖాదీ ఫర్ ఫ్యాషన్' అనే పిలుపు ద్వారా, ఇది చాలా ప్రజాదరణ పొందిందన్నారు మోదీ. 

కాన్వకేషన్‌లో విద్యార్థులకు సందేశం ఇస్తూ ప్రధానమంత్రి "మీరే నవ భారత నిర్మాతలు. వచ్చే 25 ఏళ్లలో భారతదేశాన్ని అమృత్‌కాల్‌లోకి తీసుకెళ్లే బాధ్యత మీపై ఉంది" అని అన్నారు.

0/Post a Comment/Comments