మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలపై వైఎస్ షర్మిల స్పందిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్,బీజేపీ పై ట్విట్టర్‌లో విమర్శలు కురిపించారు..
"ఊరికో ఎమ్మెల్యేను పెట్టి, మండలానికి ముగ్గురు మంత్రులను పెట్టి.. మద్యం, మనీ పంచి, అధికారాన్ని దుర్వినియోగం చేసి, ఓటర్లను బెదిరించి, ఫామ్ హౌస్ డ్రామా ఆడి.. కేవలం 10వేల ఓట్లతో గెలిచిన ఎన్నిక గెలుపేనా? ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేసి, హత్య చేసి, గెలిచామని సంబురాలు చేసుకోడానికి సిగ్గుండాలి కదా KCR గారు? కాంగ్రెస్ ఎమ్మెల్యేను కొని, ఉప ఎన్నిక తెచ్చిన బీజేపీకి నైతికత గురించి మాట్లాడే హక్కు లేదు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి,పార్టీని బలోపేతం చేసుకోవాలనుకుంటున్న BJPకి ఇప్పుడైనా సిగ్గు వచ్చిందా? దొంగదారి రాజకీయాలను తెలంగాణ ప్రజలు సహించరని బుద్ధి వచ్చిందా?" అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు వైఎస్ షర్మిల..
సిగ్గుండాలి కదా KCR గారు? కాంగ్రెస్ ఎమ్మెల్యేను కొని, ఉప ఎన్నిక తెచ్చిన బీజేపీకి నైతికత గురించి మాట్లాడే హక్కు లేదు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి,పార్టీని బలోపేతం చేసుకోవాలనుకుంటున్న BJPకి ఇప్పుడైనా సిగ్గు వచ్చిందా? దొంగదారి రాజకీయాలను తెలంగాణ ప్రజలు సహించరని బుద్ధి వచ్చిందా?
— YS Sharmila (@realyssharmila) November 6, 2022
2/2
కామెంట్‌ను పోస్ట్ చేయండి