అనంతరం మీడియా ప్రతినిదులతో మాట్లాడుతూ.. మరోసారి కేసీఆర్ కుటుంబం పై సంచలన వ్యాఖ్యలు చేసింది షర్మిల..
"కేసీఆర్ కుటుంబం మొత్తానికి ఆస్కార్ అవార్డులు ఇవ్వాలి. ఒకరేమో పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టె లేదని నాటకం ఆడాడు. ఇంకొకరు గడ్డాలు పెంచి దీక్షలు చేసినట్లు నాటకం ఆడాడు. మరొకరు అమాయకంగా బతుకమ్మ ఆడి లిక్కర్ మాఫియాను నడిపింది. ఇంకొకరు ఉద్యోగాలు ఇవ్వకున్నా హామీల కంటే ఎక్కువే ఇచ్చినట్లు నాటకాలు ఆడుతున్నారు." అని అన్నారు వైఎస్ షర్మిల.
అంబేడ్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్ల తెలంగాణ ఏర్పడితే, అలాంటి రాజ్యాంగాన్నే మార్చాలన్న నియంత కేసీఆర్ అని ఘాటు వ్యాఖ్యలు చేసింది షర్మిల.
"దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భూమి, దళిత బంధు, అంబేడ్కర్ విగ్రహం ఇలా అన్నీ మోసాలే చేశాడు.రాష్ట్రంలో కేసీఆర్ సొంత రాజ్యాంగం నడుస్తుంది. కేసీఆర్ అంటే కొట్టి చంపే రాజ్యాంగం. అణగదొక్కే రాజ్యాంగం." అని అన్నారు షర్మిల.
కామెంట్‌ను పోస్ట్ చేయండి