Delhi : ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) బీజేపీ విజయ పరంపరకు ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) ఎట్టకేలకు బ్రేక్ వేసింది.
ఆదివారం ఢిల్లీలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) లోని 250 వార్డులకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలను ఢిల్లీ అధికార పార్టీ ఆప్(AAP), కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
ఉత్కంఠభరితంగా సాగిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మెజారిటీ మార్కును దాటింది. మొదట్లో బీజేపీ మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నప్పటికీ తరువాత వెనుకబడింది.
250 వార్డుల్లో ఆప్(AAP) 134, బీజేపీ(BJP) 104, కాంగ్రెస్(Congress) 9, ఇతరులు 3 స్థానాల్లో విజయం సాధించారు.
పార్టీ MCD ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడంతో ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ఆప్(AAP) కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు..
15 ఏళ్లుగా అధికార వ్యతిరేకత ఉన్నప్పటికీ బీజేపీ ఓట్ల శాతం 1% పెరిగింది. ఢిల్లీలో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఆప్ ఓట్ షేర్ దాదాపు 12% తగ్గింది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి