తెలంగాణ రాష్ట్ర ప్రజలు తన వెంట ఉన్నంత వరకు అరెస్టులకు భయపడేది లేదని అన్నారు ఎమ్మెల్సీ కవిత.
ఢిల్లీ మద్యం కేసు రిమాండ్ రిపోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన పేరును ప్రస్తావించిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ నీచ రాజకీయాలు చేస్తోందని, తెలంగాణలో వచ్చే ఏడాది ఎన్నికలు రాబోతున్నాయి, అందుకే మోదీ కంటే ముందు ఈడీ వచ్చిందన్నారు. తనతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలపై ఈడీ, సీబీఐ కేసుల్ని లెక్కచేయాల్సిన అవసరం లేదన్నారు. జైల్లో పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చని సవాల్ చేశారు ఎమ్మెల్సీ కవిత.
ఢిల్లీ మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు రిమాండ్ రిపోర్టులో టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత పేరు పేర్కొన్నారు. ఈడీ అధికారులు అమిత్ అరోరాను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. బుధవారం ఉదయం రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ప్రస్తావించారు. రిమాండ్ రిపోర్టులో వైఎస్సార్‌సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు రాఘవ పేర్లు కూడా ఉన్నాయి.
ఈ కేసును దర్యాప్తు కోసం ఏజెన్సీకి అప్పగించిన తర్వాత కవిత తన మొబైల్ ఫోన్ ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ (IMEI)ని ఆరుసార్లు మార్చుకున్నారని ఈడీ అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి