Delhi : ఆదివారం ఢిల్లీలో అత్యంత కీలకమైన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) ఎన్నికలకు వేదిక సిద్ధమైంది. ఎలక్షన్ కమిషన్ అధికారులు, భద్రతా బలగాలు అన్నీ ఎన్నికల కోసం సన్నద్ధమయ్యాయి, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), బీజేపీ(BJP) మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లోని 250 వార్డులకు ఎన్నికలు జగరనున్నాయి. 1,349 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1.45 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, డిసెంబర్ 7న ఫలితాలు వెల్లడించనున్నారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారుల సమాచారం ప్రకారం, ఢిల్లీలో మొత్తం ఓటర్ల సంఖ్య 1,45,05,358. అందులో 78,93,418 మంది పురుషులు, 66,10,879 మంది మహిళలు, 1,061 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి