G20 అధ్యక్ష పదవిలో భారతదేశం - ప్రధాని మోదీకి మద్దతు తెలిపిన అమెరికా, ఫ్రాన్స్

G20 అధ్యక్ష పదివిని భారతదేశం అధికారికంగా స్వీకరించిన సందర్భంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రాన్
తమ మద్దతు ప్రధాని మోదీకి తెలిపారు.

"ఒకే ప్రపంచం, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు.
భారతదేశం G20 అధ్యక్ష పదవిని చేజిక్కించుకుంది! శాంతి, మరింత స్థిరమైన ప్రపంచాన్ని నిర్మించడానికి నా స్నేహితుడు నరేంద్ర మోదీ మమ్మల్ని ఒకచోటకు చేర్చగలరని నేను విశ్వసిస్తున్నాను" అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రాన్ ట్వీట్ చేశారు.

"భారత్, అమెరికాలు బలమైన భాగస్వాములు.
G20 అధ్యక్ష పదివిని భారతదేశం అధికారికంగా స్వీకరించిన నేపథ్యంలో 'నా స్నేహితుడు' ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతు ఇవ్వడానికి ఎదురుచూస్తున్నాను. 
వాతావరణం, శక్తి, ఆహార సంక్షోభాల వంటి సవాళ్లను ఎదుర్కొంటూనే మేము కలిసి స్థిరమైన, సమ్మిళిత వృద్ధిని సాధిస్తాము." అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
 ట్వీట్ చేశారు. 
డిసెంబర్ 1,2022న G20 అధ్యక్ష పదివిని భారతదేశం అధికారికంగా స్వీకరించిన విషయం తెలిసిందే. 
ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వార్తాపత్రికలకు రాసిన ఒక కథనంలో ‘వసుధైవ కుటుంబం' గురించి ప్రస్తావించారు. ఒకే ప్రపంచం, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తుగా ఎదగాలని ఆకాంక్షించారు. 

0/Post a Comment/Comments