గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించిన బీజేపీ - రికార్డు స్థాయిలో 156 సీట్లు గెలుపు

gujarat assembly elctions 2022 bjp narendra modi politics metera
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయ ఢంకా మోగించింది. రికార్డు స్థాయిలో విజయం సాధించి గుజరాత్ రాష్ట్రం బీజేపీ కంచుకోటా అని నిరూపించుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో వరుసగా 7వ సారి బీజేపీ విజయం సాధించి చరిత్ర సృష్టించింది.

బీజేపీ 156 స్థానాల్లో విజయం సాదించగా, కాంగ్రెస్ 17, ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) 5, సమాజ్వాదీ పార్టీ 1, ఇండిపెండెంట్లు 3 సీట్లు గెలిచాయి. 

ఈనెల 12న ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, బీజేపీ ప్రధాన నాయకుల సమక్షంలో భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. 

డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో 182 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 

1995 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 121 సీట్లు గెలిచి మొదటి సారి ప్రభుత్వాన్ని స్థాపించింది. 1998 ఎన్నికల్లో 117 సీట్లు, 2002 ఎన్నికల్లో 127 సీట్లు, 2007 ఎన్నికల్లో 117 సీట్లు, 2012 ఎన్నికల్లో 115 సీట్లు, 2017 ఎన్నికల్లో 99 సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని స్థాపించింది. ఇక తాజా ఎన్నికల్లో అన్ని రికార్డు స్థాయిలో ఏకంగా 156 సీట్లు గెలిచి చరిత్ర సృష్టించింది.  

0/Post a Comment/Comments