Himachal Pradesh : ఉత్కంఠభరితంగా సాగిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మొదట్లో బీజేపీ మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నప్పటికీ తరువాత వెనుకబడింది.
భారతీయ జనతా పార్టీ (BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ ఓటమిపాలవ్వడం గమనర్ఘం.
కాంగ్రెస్ పార్టీ 40 స్థానాల్లో విజయం సాదించగా , బీజేపీ 25 స్థానాలతో సరిపెట్టుకుంది. బీజేపీ రెబెల్ అభ్యర్థులు 3 స్థానాల్లో గెలిచారు. బీజేపీకి 42.99%, కాంగ్రెస్ కి 43.91% శాతం ఓట్లు పడ్డాయి.
బీజేపీ ఓటమికి పార్టీ అంతర్గత రాజకీయాలే కారణమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 12 నవంబర్ 2022న 68 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగాయి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి