తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు ఎమ్మెల్సీ కవిత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చెల్లెలు వైఎస్ షర్మిల మధ్య ట్విట్టర్ లో మాటల యుద్ధం కొనసాగుతుంది.
మంగళవారం ప్రగతి భవన్ ను ముట్టడించడానికి ప్రయత్నించిన వైఎస్ షర్మిల పై ఎమ్మెల్సీ కవిత ట్విట్ల ద్వారా విరుచుకుపడ్డారు.
"తాము వదిలిన “బాణం” తానా అంటే తందానా అంటున్న “తామర పువ్వులు” " అని ట్వీట్ చేశారు ఎమ్మెల్సీ కవిత.
కవిత ట్వీట్ కు వైఎస్ షర్మిల వెంటనే స్పందించారు. "పాదయాత్రలు చేసింది లేదు.. ప్రజల సమస్యలు చూసింది లేదు.. ఇచ్చిన హామీల అమలు లేదు.. పదవులే కానీ పనితనం లేని గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు." అని ట్వీట్ చేసారు వైఎస్ హర్మిల.
షర్మిల ట్వీట్ కు కౌంటర్ గా మరోసారి రియాక్ట్ అయ్యారు ఎమ్మెల్సీ కవిత.
"అమ్మా.. కమల బాణం ఇది మా తెలంగాణం పాలేవో నీళ్ళేవో తెలిసిన చైతన్య ప్రజా గణం మీకు నిన్నటిదాకా పులివెందులలో ఓటు నేడు తెలంగాణ రూటు మీరు కమలం కోవర్టు ఆరేంజ్ ప్యారేట్టు . మీ లాగా పొలిటికల్ టూరిస్ట్ కాను నేను రాజ్యం వచ్చాకే రాలేదు నేను ఉద్యమంలో నుంచి పుట్టిన మట్టి " కవిత" ను నేను ! " అని ట్వీట్ చేశారు కవిత.
కామెంట్‌ను పోస్ట్ చేయండి