నల్గొండ జిల్లా అభివృద్ధికి 1544 కోట్లు ప్రకటించారు కేటిఆర్. వచ్చే ఆరు నుంచి ఏడు నెలల్లో నల్గొండలో అభివృద్ధి పనులకు రూ.1,544 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించనున్నట్లు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ప్రకటించారు.
గతంలో నల్గొండలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై మునుగోడులో జరిగిన సమీక్షా సమావేశం అనంతరం కేటీఆర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. 1958 తర్వాత నల్గొండ లోని 12 అసెంబ్లీ స్థానాల్లో ఒకే రాజకీయ పార్టీ గెలుపొందడం ఇదే ప్రథమమని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లలో నల్గొండలోని అన్ని పట్టణ స్థానిక సంస్థల అభివృద్ధికి 454 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నారు కేటీఆర్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి