Gujarat Elections : గుజరాత్‌లోని కలోల్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే 'రావణ్' వ్యాఖ్యలను ప్రస్తావించారు. మోదీని ఎవరు ఎక్కువగా దూషించాలనే దానిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు పోటీ పడుతున్నారని అన్నారు. గుజరాత్ రాష్ట్రం రామభక్తుల భూమి, రామభక్తుల భూమిలో కాంగ్రెస్ అధ్యక్షుడు నన్ను 100 తలల రావణుడు అని పిలిచారు. రాముడి ఉనికిని ఎప్పుడూ నమ్మని వారు ఇవాళ రామాయణం నుండి రావణుడిని తీసుకొస్తున్నారని ఎగతాళి చేశారు నరేంద్ర మోదీ. నాపట్ల అలాంటి పదాలు వాడుతున్నందుకు ఆ పెద్దాయన(మల్లికార్జున్ ఖర్గే)కు కనీస పశ్చాత్తాపం కూడా లేదన్నారు.
మంగళవారం గుజరాత్‌లో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీని రావణుడితో పోల్చిన విషయం తెలిసిందే.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ఓటింగ్ ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. రాష్ట్రంలోని 19 జిల్లాల్లోని 89 స్థానాలకు పోలింగ్ జరిగింది. డిసెంబరు 5న రెండో విడత పోలింగ్ నిర్వహించనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో గత 25 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి