ఎన్నికల సమరానికి ‘వారాహి’ సిద్ధం! - పవన్ కళ్యాణ్ ట్వీట్

Pawan Kalyan varahi photos twitter janasena poltics meter

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టబోయే యాత్రకు ప్రత్యేక ప్రచార రథం 'వారాహి' సిద్ధమైంది. 

"ఎన్నికల సమరానికి ‘వారాహి’ సిద్ధం!" అని పవన్  కళ్యాణ్ ట్వీట్ చేశారు. పవన్ ప్రచార రథం 'వారాహి' తో దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వచ్చే ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు  2024 ఏప్రిల్ - జూన్ మధ్యలో జగరనున్నాయి. 

2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలను కైవసం చేసుకోగా, తెలుగుదేశం పార్టీ కేవలం 23 సీట్లు గెలుచుకుంది. జనసేన పార్టీ ఒక్క సీటుతో శాసనసభలో అడుగుపెట్టగా, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ(BJP) ఒక్క సీటు కూడా గెలవలేకపోయాయి.

ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 49.95%, తెలుగుదేశం పార్టీకి 39.26%, జనసేన పార్టీకి 5.54% శాతం ఓట్లు పోల్ అయ్యాయి. 

More Photos :





0/Post a Comment/Comments