Gujarat Elections 2022 - ప్రధాని మోదీ మెగా రోడ్‌షోలో పాల్గొన్న 10 లక్షల మంది ప్రజలు

narendra modi road show gujarat 10 lakhs people politics meter

Gujarat :
గుజరాత్‌లో ప్రధాని మోదీ చేపట్టిన "అతిపెద్ద, పొడవైన" రోడ్‌షోలో 10 లక్షల మంది ప్రజలు పాల్గొన్నారు. 

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ కోసం ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అహ్మదాబాద్‌లోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు గంటలపాటు మెగా రోడ్‌షో నిర్వహించారు.

ప్రత్యేకంగా రూపొందించిన వాహనంలో నిలబడి నరోడా గ్రామం నుంచి మోదీ యాత్రను ప్రారంభించారు. నరోడ నుంచి ప్రారంభమై గాంధీనగర్ సౌత్ నియోజకవర్గం వరకు 50 కిలోమీటర్లకు పైగా ఈ మెగా రోడ్‌షో సాగింది.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ 89 స్థానాలకు గురువారం ఓటింగ్ జరగగా, అహ్మదాబాద్ నగరంలోని 16 స్థానాలతో సహా మిగిలిన 93 స్థానాలకు డిసెంబర్ 5న పోలింగ్ జరగనుంది. 

0/Post a Comment/Comments