30-40% తగ్గింపు ధరతో పాకిస్తాన్‌కు ముడి చమురు సరఫరా చేయడానికి రష్యా నిరాకరించింది.
ముడిచమురుపై భారత్, చైనాల మాదిరిగానే పాకిస్తాన్‌కు కూడా అదే తగ్గింపు ధరకు ఇవ్వాలని పాకిస్తాన్ కోరగా, రష్యా నిరాకరించింది. ప్రస్తుతం ఏమీ అందించలేమని పేర్కొంది.
న్యూఢిల్లీకి అంగీకరించిన నిబంధనల ప్రకారం ఇస్లామాబాద్ మాస్కోతో ముడి చమురు ఒప్పందాన్ని చేసుకోవాలనుకుంటున్నట్లు పాకిస్తాన్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
పెట్రోలియం శాఖ సహాయ మంత్రి ముసాదిక్ మాలిక్ నేతృత్వంలోని పాకిస్తాన్ ప్రతినిధి బృందం నవంబర్ 29న మూడు రోజుల పాటు మాస్కోలో పర్యటించి తగ్గింపు ధరలకు ముడి చమురు దిగుమతి, చెల్లింపు విధానం, రవాణా ఖర్చులు వంటి అంశాలపై చర్చించింది, అయితే చర్చలు విఫలమయ్యాయి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి