వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(WEF) సమావేశంలో పాల్గొనబోతున్న మొట్ట మొదటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గా యోగి ఆదిత్యనాథ్ నిలిచారు.
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్-2023 సమావేశానికి హాజరవ్వనున్నారు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఒక ప్రతినిధి బృందంతో కలిసి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు వెళ్లబోతున్నారు. ఉత్తరప్రదేశ్‌ను “ఉత్తమ పెట్టుబడి గమ్యస్థానంగా” ప్రదర్శించడానికి రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఒక పెవిలియన్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.
ముఖ్యమంత్రి పర్యటన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఈ సమావేశం జనవరి 16 నుండి 20 వరకు దావోస్‌లో జరగనుంది. వచ్చే ఐదేళ్లలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాన్ని ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ ప్రయత్నం సాగుతోంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి