తెలంగాణ గవర్నర్‌ను కలిసేందుకు రాజభవన్ చేరుకున్న వైఎస్ షర్మిల..

ys sharmila tamilisai soundararajan raj bhavan politics meter
YS Sharmila - Governor Tamilisai Soundararajan 

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసేందుకు వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. 

సోమవారం, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు షర్మిల యాత్రకు అడ్డుపడి, ఆమె కార్వాన్ పైనా, మరో వాహనంపైనా పెట్రోల్ పోసి నిప్పింటించారు. ఈ ఘటనలో వైఎస్‌ఆర్‌టీపీ, టీఆర్‌ఎస్‌ నేతల మధ్య వాగ్వాదం జరగడంతో వరంగల్‌లో వైఎస్‌ షరీమలను అరెస్టు చేశారు పోలీసులు. 

మంగళవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు షరీమల పిలుపునివ్వడంతో ప్రగతి భవన్‌ వద్ద హై డ్రామా జరిగింది. పాడైపోయిన కారును ప్రగతి భవన్‌కు తీసుకెళ్లి నిరసన తెలిపారు షర్మిల. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. షర్మిలను వాహనం దిగాలని కోరినా వినలేదు. దీంతో ఆమె కారులో ఉండగానే లిఫ్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు.

ఈ వివాదంపై పలువురు బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు స్పందిస్తూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఖరిని ఖండించారు. 

0/Post a Comment/Comments