కమ్యూనికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ యొక్క కొత్త నిబంధనల ప్రకారం నమోదు చేసుకోవడంలో విఫలమైనందుకు నేపాల్ ప్రభుత్వం సెప్టెంబర్ 4, 2025న Facebook, X, YouTube, LinkedIn, Reddit, Signal, Snapchat తో సహా 26 సోషల్ మీడియా యాప్‌లను నిషేధించింది.
యువత దీన్ని వ్యతిరేకించి నిరసనలు ప్రారంభించింది. నిరసనలు కాఠ్మాండూ, ఇతర నగరాల్లో పెద్ద ఎత్తుతో జరిగాయి. మొదట శాంతియుతంగా మొదలైనా, పోలీసులు లైవ్ బుల్లెట్లు, టియర్ గ్యాస్, వాటర్ క్యానన్‌లతో దాడి చేయడంతో హింసాత్మకంగా మారాయి. సెప్టెంబర్ 8-9 తేదీల్లో 19 మంది మరణించగా, 300 మందికి పైగా గాయపడ్డారు.
నిరసనకారులు పార్లమెంటు, సుప్రీంకోర్టు, ప్రభుత్వ భవనాలు, రాజకుటుంబ సభ్యుల ఇళ్లపై దాడి చేసి తగలబెట్టారు.
ప్రభుత్వం సోషల్ మీడియా యాప్‌లపై నిషేధం విధించడం ఒక్కటే ఈ నిరసనలకు కారణం కాదు.
ఈ నిరసనల ద్వారా రాజకీయ అవినీతి, నెపొటిజం (కుటుంబ ఆధిపత్యం), రాజకీయ నాయకుల కుమార్తెలు "నెపో కిడ్స్" ల విలాసవంతమైన జీవితాలపై యువత తమ కోపాన్ని వ్యక్తం చేశారు.
నేపాల్‌లో ప్రజలు పేదరికంతో పోరాడుతున్నప్పుడు, రాజ కుటుంబాలు డిజైనర్ బ్యాగులు, విదేశీ ప్రయాణాలు చేస్తూ లగ్జరీ జీవితం గడుపుతున్నాయని జెన్ Z (యువత) ఆరోపించింది. ఇది టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ వీడియోల ద్వారా వెలుగులోకి వచ్చింది.
ఫలితంగా, సెప్టెంబర్ 9, 2025న, ప్రధాన మంత్రి కె.పి. శర్మ ఓలి, కొంతమంది ప్రభుత్వ మంత్రులతో కలిసి నిరసనలకు ప్రతిస్పందనగా రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయారు.
ఈ నిరసనలు నేపాల్ ప్రజాస్వామ్యంలో యువత శక్తిని చూపించాయి.
నేపాల్ మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కి శుక్రవారం రాత్రి రాష్ట్రపతి కార్యాలయం శీతల్ నివాస్‌లో జరిగిన కార్యక్రమంలో తాత్కాలిక ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నేపాల్ తొలి మహిళా ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఆమె చరిత్ర సృష్టించారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి