సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ అభినందనలు..


ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.. 
ఈ సందర్భంగా ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుతో తనకున్న సుదీర్ఘ రాజకీయ సంబంధాలను గుర్తు చేశారు.

"ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అభినందనలు తెలిపాను. ఆయన భవిష్యత్తు దృక్పథం మరియు సుపరిపాలన పట్ల నిబద్ధత రాజకీయ జీవితంలో స్థిరంగా ఉన్నాయి. 2000ల దశకం  ప్రారంభంలో మేమిద్దరం ముఖ్యమంత్రులుగా ఉన్నప్పటి నుండి, అనేక సందర్భాల్లో చంద్రబాబు గారితో కలిసి పనిచేశాను. ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసం ఆయన ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను." అని X లో ప్రధాని మోదీ పోస్ట్ చేశారు. 


ప్రధాని మోదీ అభినందనలకు స్పందిస్తూ చంద్రబాబు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. మోదీ సంకల్పించిన వికసిత్ భారత్ @ 2047 లక్ష్యంలో మేం భాగస్వాములవుతామని అయన తెలియచేశారు. 

"గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ, ఆప్యాయతతో మీరు తెలిపిన శుభాకాంక్షలకు ధన్యవాదాలు. మీ సహకారంతో స్వర్ణాంధ్ర సాధనకు పని చేస్తాను. మీరు సంకల్పించిన వికసిత్ భారత్ @ 2047 లక్ష్యంలో మేం  భాగస్వాములవుతామని తెలియచేస్తున్నాను." అని X లో చంద్రబాబు పోస్ట్ చేశారు.

0/Post a Comment/Comments