విద్యాసంస్థల్లో వందే మాతరం ఆలాపన తప్పనిసరి: యోగి ఆదిత్యనాథ్


Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలల్లో వందే మాతరం ఆలాపనను తప్పనిసరి చేయనుంది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ గేయం 150 ఏళ్ల సంస్మరణను దేశవ్యాప్తంగా ప్రారంభించిన కొద్ది రోజుల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారం రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, విద్యాసంస్థల్లో వందే మాతరం ఆలాపనను తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించారు.గోరఖ్‌పూర్‌లో నిర్వహించిన 'ఏక్తా యాత్ర', వందే మాతరం సామూహిక ఆలాపన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి, విద్యా సంస్థల్లో జాతీయ గేయం ఆలాపన చేయడం వల్ల చిన్నప్పటి నుండే విద్యార్థులలో గౌరవం, దేశభక్తి పెంపొందుతుందని అన్నారు.“జాతీయ గేయం వందే మాతరం పట్ల గౌరవ భావం ఉండాలి. ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రతి పాఠశాల, విద్యాసంస్థలో దీని ఆలాపనను తప్పనిసరి చేస్తాం” అని ఆదిత్యనాథ్ తెలిపారు.అంతేకాకుండా, జాతీయ గేయం వందేమాతరంను వ్యతిరేకిస్తున్న సమాజ్వాదీ పార్టీ ఎంపీపై యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు వందేమాతరంను వ్యతిరేకించే వారిని విమర్శిస్తూ ఆదిత్యనాథ్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ నాయకులు మహమ్మద్ అలీ జిన్నా, మహమ్మద్ అలీ జౌహర్‌లను ఉదాహరించారు. ఇటువంటి వ్యతిరేకత భారత ఐక్యతను దెబ్బతీస్తుందని ఆయన అన్నారు. భారతదేశంలో మళ్లీ కొత్త జిన్నా పుట్టకుండా చూసుకోవాలని సీఎం యోగీ పిలుపునిచ్చారు.“1896 నుంచి 1922 వరకు ప్రతి కాంగ్రెస్ సమావేశంలో వందే మాతరం ఆలాపన జరిగింది. కానీ 1923లో మొహమ్మద్ అలీ జౌహర్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు, సమావేశంలో వందే మాతరం ప్రారంభం అవుతున్న సమయంలో సభ నుంచి జౌహర్ బయటికి వెళ్లి, పాల్గొనడానికి నిరాకరించారు.ఆనాడు కాంగ్రెస్ పార్టీ జౌహర్‌ను అధ్యక్ష పదవి నుండి తొలగించి, వందేమాతరం ద్వారా భారత జాతీయతను గౌరవించి ఉంటే, భారతదేశం విడిపోయేది కాదు" అని ఆదిత్యనాథ్ అన్నారు.వందే మాతరం గేయాన్ని ప్రముఖ కవి బంకిమ్ చంద్ర చట్టోపాధ్యాయ్ 1875 నవంబర్ 7న అక్షయ నవమి సందర్భంగా రచించారు. ఈ గేయం మొదట చటర్జీ నవల ‘ఆనందమఠ్’లో భాగంగా ‘బంగదర్శన్’ సాహిత్య పత్రికలో ప్రచురితమైంది.

0/Post a Comment/Comments