ఎన్నికల సమయంలో మాత్రమే మీకు రాముడు గుర్తొస్తడా?– బీజేపీపై కవిత ధ్వజం


ఆదిలాబాద్:
ఆదిలాబాద్ జిల్లాలోని 1,200 సంవత్సరాల చరిత్ర కలిగిన జైనథ్ ఆలయం (శ్రీ నారాయణ స్వామి దేవాలయం) శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో, బీజేపీ నేతలు ఎన్నికల సమయంలోనే శ్రీరాముడిని గుర్తుచేసుకుంటారని మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.

ఆదిలాబాద్‌లో జనం బాట యాత్రలో భాగంగా మీడియాతో మాట్లాడిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు జైనాథ్ ఆలయాన్ని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. "ఎన్నికల సమయంలోనే బీజేపీ నేతలకు రాముడు గుర్తువస్తాడు. సాధారణ సమయంలో ఆలయాల పట్ల శ్రద్ధ చూపరు" అని ఆమె విమర్శించారు. ఆలయ గర్భగుడిలో దేవుని విగ్రహం పైన నీటి ఊట ఏర్పడినట్టు ఆమె పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ గోడం నాగేష్‌ను ఎంపీ లాడ్స్‌(MPLADS) నిధుల నుంచి రూ.20 లక్షలు ఆలయాభివృద్ధికి కేటాయించాలని కవిత కోరారు. ఆలయ పునరుద్ధరణకు తాను వ్యక్తిగతంగా దోహదపడతానని ఆమె హామీ ఇచ్చారు.

0/Post a Comment/Comments