తెలంగాణలో కాషాయ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మున్సిపల్ ఎన్నికలకు ముందు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీని వీడి, బీఆర్‌ఎస్‌లోకి తిరిగి వస్తున్నట్లు ప్రకటించారు, బిఆర్‌ఎస్ పార్టీని తన సొంత పార్టీగా పేర్కొన్నారు.
2024 లోక్ సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన ఆరూరి రమేష్.. వరంగల్ బీజేపీ లోక్ సభ అభ్యర్థిగా నిలబడి కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య కు గట్టి పోటీ ఇచ్చి 2వ స్థానం దక్కించుకున్నారు.
ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘనంగా పుంజుకోడవం, బీజేపీ పార్టీ తన ఉనికిని చాటుకోవడంలో విఫలం అవ్వడంతో ఆరూరి రమేష్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు..
రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇంకా పెద్ద ఎత్తున చేరికలు జరుగుతాయని బీఆర్ఎస్ పార్టీ చెపుతుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి