తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం.. బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్లైనా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మధ్య కుదిరిన సయోధ్య.
తెలంగాణ బీజేపీలో దీర్ఘకాలంగా ఉన్న విభేదాలను పరిష్కరించుకునేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ కీలకమైన సయోధ్య సమావేశాన్ని ఎంపీ లక్ష్మణ్ నివాసంలో నిర్వహించారు.
రాజ్య సభ ఎంపీ లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి అభయ్ పాటిల్ మధ్యవర్తిత్వం వహించి బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య సయోధ్య కుదిర్చారు.
తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చే దిశగా కృషి చేయాలని ఇద్దరు నేతలకు అభయ్ పాటిల్ దిశానిర్దేశం చేశారు.
ఈ భేటీకి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
\
Weekends are even better when they begin with good conversations and shared purpose.
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) July 18, 2026
It was nice spending time with Rajya Sabha MP @drlaxmanbjp Anna, @BJP4Telangana Incharge Shri @iamabhaypatil Ji, MP Shri @Eatala_Rajender Anna .
Together, under the leadership of Hon’ble Prime… pic.twitter.com/ktAZLRIeuV

కామెంట్‌ను పోస్ట్ చేయండి